తెలంగాణ

telangana

ETV Bharat / crime

Godavarikhani Accident Today: బర్త్​డే పార్టీకి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి - కల్వర్టును ఢీకొట్టిన బైక్

Godavarikhani Accident Today : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశ్​నగర్​లో ప్రమాదం జరిగింది. కల్వర్టును బైక్​ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. ఇంకో యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

Godavarikhani Accident
Godavarikhani Accident

By

Published : Dec 28, 2021, 10:18 AM IST

Godavarikhani Accident Today : స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు ముగ్గురు స్నేహితులు కలిసి వెళ్లారు. అతడికి కేక్ కట్ చేయించి.. ఆనందంగా కాసేపు గడిపారు. అంతసేపు ఎంతో ఉల్లాసంగా ఎంజాయ్ చేసిన వారు.. తిరిగి ఇంటికి బయలుదేరారు. వేడుకలో మద్యం సేవించి ఉండటం.. వేగంగా బైక్ నడపడం వల్ల జరిగిన ప్రమాదం ఆ ముగ్గురిలో ఇద్దరిని బలిగొంది. మరో యువకుడుని మృత్యువుతో పోరాడేలా చేసింది.

Accident at Godavarikhani Today :పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశ్​నగర్​ వద్ద వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇంకో యువకుడు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టామిట్టాడుతున్నాడు.

Peddapalli Accident today : గోదావరిఖని రామ్​నగర్​కు చెందిన మహేశ్, శివరామ్, సిద్ధూలు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు దూళిపేటకు వెళ్లి బైక్​పై తిరిగొస్తుండగా.. రమేశ్​నగర్​ వద్ద కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహేశ్​, శివరామ్​లు మృతిచెందగా.. సిద్ధూ కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను, గాయపడిన యువకుడి ఆస్పత్రికి తరలించారు. మత్తులో వేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులు గంజాయి సేవించి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details