బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆటోను దాటుతూ బస్సు కిందపడి చనిపోయిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హస్మత్‌పేటకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
ఆటోను తప్పించబోయి బస్సు కిందపడి వ్యక్తి మృతి - సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఆటోను దాటుతూ బస్సు కింద పడి చనిపోయిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఆటోను తప్పించబోయి బస్సు కిందపడి వ్యక్తి మృతి
సాయంత్రం దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తుండగా ఆటో దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన బస్సు ఢీ కొనగా తలకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.