రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లిలో జరిగింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన కల్తీ రవి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై గుండాల నుంచి రాత్రివేళ స్వగ్రామానికి బయలుదేరాడు. కాచనపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు.
Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్... చికిత్స పొందుతూ మృతి - తెలంగాణ వార్తలు
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్‌ను విధి వెంటాడింది. ఇంటికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి సమీపంలో జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
గుర్తించిన స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు గట్టిగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం కావడం వల్ల పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి.. అక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల తన కుమారుడు తొలి పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నాడు.
ఇదీ చూడండి:MURDER: దుర్భాషలాడుతున్నాడని తండ్రినే కడతేర్చాడు!