గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న భేతి మహేంద్‌రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదు మేరకు.... పోలీసులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ రెండో ఠాణాలో ఇప్పటికే కేసు నమోదు కాగా... విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు.
Arrest : మంత్రి గంగుల ఫిర్యాదు... భాజపా నేత అరెస్టు - bethi mahender reddy got arrested
గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న భేతి మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
భాజపా నేత భేతి మహేందర్ రెడ్డి అరెస్టు
విచారణకు హాజరుకాకపోవడంతో హైదరాబాద్ హెచ్ఆర్సీ కార్యాలయం వద్ద భాజపా నేత మహేందర్‌రెడ్డిని అదుపులోకి(Arrest) తీసుకున్నారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బొమ్మకల్ భూమి వ్యవహారంలోనూ కులం పేరుతో దూషించారని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.