మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తొమ్మిది మంది నకిలీ మావోయిస్టుల(fake Maoists arrested) ను పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి సర్కిల్ కార్యాలయంలో రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి.. వారిని మీడియా ఎదుట హాజరుపరిచారు.
పట్టణంలోని కాల్ టెక్స్ టీ జంక్షన్ వద్ద బిక్షపతి అనే నకిలీ మావోయిస్టు(fake Maoists arrested) ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 1991 నుంచి 1996 వరకు పీపుల్స్ వార్ పార్టీ సభ్యునిగా భిక్షపతి పని చేశాడని.. 1996లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
ముఠాగా ఏర్పడి
జనగాం జిల్లా తమ్మడపల్లి(fake Maoists arrested) గ్రామానికి చెందిన వడ్లకొండ రాజ్‌కుమార్, హైదరాబాద్ బోరబండకు చెందిన మోటమర్రి ప్రదీప్ కుమార్, గూడాకు చెందిన మహమ్మద్ మతిన్ అలీ, మందమర్రికి చెందిన తుంగ క్రాంతికుమార్, వరంగల్ జిల్లాకు చెందిన రాగుల రాజశేఖర్, మహమ్మద్ ఆఫజల్, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, రాగుల తిరుపతి ముఠాగా ఏర్పడి ప్రజలను బెదిరిస్తున్నట్లు సీపీ వివరించారు.
వరంగల్ జిల్లాకు చెందిన పునీత్ భారతి పరారీలో ఉన్నట్లు సీపీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అందుగుల శ్రీనివాస్ అనే మరో వ్యక్తి ప్రస్తుతం జైల్లో ఉండి స్థానికంగా డబ్బున్న వారి సమాచారం అంతా వీరికి చేరవేశారని వెల్లడించారు. వీరిలో తొమ్మిది(fake Maoists arrested) మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి 2 దేశీయ తుపాకులు, నాలుగు డమ్మీ తుపాకులు, ఏడు చరవాణులు, రెండు తల్వార్లు, కారు, స్కూటీ, రెండు వాకీటాకీలు, లేఖలు, ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐ జగదీశ్ ఉన్నారు.
తుపాకులతో బెదిరించి
పదిహేను రోజుల క్రితం ఇదే విధంగా మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. తుపాకులతో బెదిరించి దోపిడీల(Fake Maoists Arrested)కు పాల్పడుతున్న నలుగురు సభ్యులతో కూడిన మాజీ మావోయిస్టు ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి మూడు తుపాకులు, ఓ నాటు తుపాకి, ఆరు డిటోనేటర్లు, 15 గ్యాస్ సిలిండర్లు, 40గ్రాముల గన్‌పౌడర్, మావోయిస్టుల లెటర్ హెడ్స్, డ్రిల్లింగ్ మిషిన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
వీరు యాదాద్రి శివారు ప్రాంతాల్లో దారి దోపిడీలు(Fake Maoists Arrested), దుకాణాల్లో బెదిరింపులకు పాల్పతుంటారని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టయిన వారంతా గతంలో అప్పటి పీపుల్స్ వార్, జనశక్తి పార్టీలో పని చేశారని తెలిపారు.
ఇదీ చదవండి:ఇది గౌరవ సభా.. కౌరవ సభా: చంద్రబాబు