రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన విద్యార్థులు డిగ్రీ వార్షిక పరీక్షల కోసం జిల్లా కేంద్రంకు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ పోచమ్మ దేవాలయ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని గాయపడిన విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆటో అదుపుతప్పింది.. భవిష్యత్తుపై గుబులు మొదలైంది.. - కరీంనగర్ తాజా నేర వార్తలు
ఆ విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి ఆటోలో బయలుదేరారు. కాసేపు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రమాదంలో క్షతగాత్రులు
చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవి శంకర్లు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఓ వైపు గాయాలు.. మరోవైపు భవిష్యత్‌పై అస్పష్టతతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి కావడం లేదని భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య