ఏపీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో అధికార పార్టీ కార్యకర్తలు తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. 6 ద్విచక్రవాహనాలు, ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంచించారు (attack on ex Zptc house Guntur).
attack on ex Zptc house in Guntur: తెదేపా మాజీ జడ్పీటీసీ ఇంటిపై 'వైకాపా' దాడి - ap news
ఏపీలోని గుంటూరు (Guntur) జిల్లా కొప్పర్రులో ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ కార్యకర్తలు తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. (attack on ex Zptc house Guntur) గొడవలో పలువురికి గాయాలయ్యాయి. 6 బైక్‌లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల చర్యలు చేపడుతున్నారు.
ycp attak
ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగేంద్ర, రవీంద్రలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడులకు పాల్పడిన వారి వివరాలపై ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
ఇదీ చూడండి:tdp national president chandrababu: 'ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి'