Accident: స్కూటీని ఢీకొట్టిన లారీ... ఏఎస్సై మృతి
పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏఎస్సై వెళ్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
asi
పెద్దపల్లి రాజీవ్ రహదారిపై స్కూటీని లారీ ఢీకొట్టిన ఘటనలో ఏఎస్సై భాగ్యలక్ష్మి మృతిచెందారు. కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏఎస్సై భాగ్యలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమార్తె శిరీషకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
- ఇదీ చదవండి :Covid: అనాథలైన 30వేల మంది చిన్నారులు
Last Updated : Jun 17, 2021, 12:26 PM IST