తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్​లో రెమ్​డెసివిర్​ విక్రయం.. నిందితుడి అరెస్ట్​ - రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ తాజా వార్తలు

బ్లాక్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ విక్రయిస్తున్న ఓ ఔషద దుకాణం యజమానిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

redemisivir injection
రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​

By

Published : Apr 29, 2021, 5:13 PM IST

కొవిడ్‌ బారిన పడిన వారికి అందించాల్సిన ఔషదాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కొంత మంది అక్రమార్కులు. ఒక వైపు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ... ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాచిగూడలోని ఓ ఔషద దుకాణం యజమాని రెమ్​డెసివిర్​ ఇంజక్షన్‌ను రూ.30 వేల రూపాయలకు విక్రయిస్తూ టాస్క్​ఫోర్స్​ పోలీసులకు పట్టుపడ్డాడు.

కాచిగూడ నింబోలిఅడ్డా ప్రాంతంలో సుమ ఫార్మసీ ఔషద దుకాణం నిర్వహిస్తున్న శ్రీహరి రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.30 వేల రూపాయలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతనిపై నిఘా ఉంచి బస్టాండ్‌లో ఉన్న సమయంలో పట్టుకున్నారు. విచారించగా అధిక ధరలకు ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్టు తేలింది. శ్రీహరి నుంచి నాలుగు ఇంజక్షన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు- బజాజ్ ఫినాన్స్ జంట షేర్ల జోరు

ABOUT THE AUTHOR

...view details