Minor Rape Case:జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారంజరిగిన తర్వాత నుంచి అలాంటి ఘటనలు ఒకటి తర్వత మరొకటి.. రోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. అన్నింట్లలో బాధితులు మైనర్లే కావటం.. ఆలస్యంగా బయటకు వస్తుండటం గమనార్హం. తాజాగా.. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్లోనూ అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల విద్యార్థినిపై.. నల్లకుంటకు చెందిన అమిత్ వర్ధన్(19) అనే సహచర విద్యార్థి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
బడంగ్‌పేట్‌కు చెందిన అమ్మాయి కాచిగూడలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న సహచర విద్యార్థి అమిత్వర్దన్.. అమ్మాయితో గతేడాది పరిచయం ఏర్పర్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లిచేసుకుంటానని.. కొన్ని రోజులు వెంటపడ్డాడు. బాలిక నంబర్ తీసుకుని తరుచూ ఫోన్ చేస్తూ.. తన ప్రపోజల్‌ను అంగీకరించమని కోరేవాడు. అతడి మాటలను నమ్మిన అమ్మాయి.. చివరికి 2022 జనవరిలో వర్ధన్ ప్రేమను అంగీకరించింది. ఆ రోజు నుంచి ఇద్దరు ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవాళ్లు.