తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fake Certificates: నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తోన్న మరో ముఠా అరెస్ట్​.. - నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తోన్న మరో ముఠా అరెస్ట్​.

Fake Certificates: నగరంలో మరో నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ముగ్గురు ముఠా సభ్యులతో పాటు వాళ్ల దగ్గర సర్టిఫికేట్లు తీసుకుంటున్న అయిదుగురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పలు వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.

another-gang-arrested-for-making-fake-certificates-in-hyderabad
another-gang-arrested-for-making-fake-certificates-in-hyderabad

By

Published : Feb 24, 2022, 6:02 AM IST

Fake Certificates: నకిలీ సర్టిఫికేట్ల కేసులో పోలీసులు మరో ఎనిమిది మందిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ద్రువపత్రాలు తయారు చేస్తున్న ముగ్గురితో పాటు... వాటిని తీసుకున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.

సంతోష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ నవీద్‌.. విదేశాలకు విద్యాభ్యాసానికి వెళ్లాలనుకునే వారికి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎక్కువ వచ్చినట్లు నకిలీ తయారు చేస్తున్నట్లు తెలిపారు. సర్టిఫికేట్లు, వర్సిటీలను బట్టి 70 నుంచి 80 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details