రాజన్న సిరిసిల్లలోని మానేరు వంతెన కింద మరో మృతదేహం(dead body found in water) లభ్యమైంది. మనోజ్ మృతదేహం చెక్‌డ్యామ్ నుంచి బ్రిడ్జి వద్దకు కొట్టుకొచ్చింది. ఈనెల 15న 9 మంది విద్యార్థులు చెక్‌డ్యామ్‌లో ఈత కోసం దిగారు. తొమ్మిది మందిలో ఆరుగురు విద్యార్థులు చెక్‌డ్యాంలో మునిగిపోయారు. మంగళవారం వరకు ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశారు. మనోజ్ మృతదేహం బ్రిడ్జి వరకు కొట్టుకురాగా... వంతెన కింద గుర్తించారు.
ఈత రాకపోయినా దిగారా?
సిరిసిల్ల రాజీవ్‌నగర్‌కు చెందిన 9 మంది విద్యార్థులు సరదాగా మానేరు(manair incident) వాగు వద్దకు వచ్చారు. అందులోని ఆరుగురు విద్యార్థులు ఈత రాకపోయినా చెక్‌డ్యామ్‌లోకి దిగారు. ఆరుగురు ఒకేసారి నీటమునిగారు. బయటే ఉన్న మరో ముగ్గురు విద్యార్థులు తమ మిత్రులు నీటిలో మునిగిపోవడంతో ఆందోళనకు గురై... పరుగున కాలనీకి వెళ్లి ప్రమాదం గురించి చెప్పారు. ఆరుగురి మృతదేహాలను(dead body found in water) నిన్నటి నుంచి ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే.... తల్లిదండ్రులు వాటిని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరతారనుకుంటే అకాల మరణంతో కడుపు కోత మిగిల్చారంటూ విలపించారు.
తరుచుగా జరుగుతున్నాయా?
ఈఏడాది భారీగా కురిసిన వర్షాలకు వాగులో నిరంతరం నీరు ప్రవహిస్తోంది. నెహ్రూనగర్ సమీపంలో నిర్మించిన చెక్‌డ్యాం వరదలకు గండి పడింది. ఇక్కడ ఇసుక కోతతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. లోతైన ప్రాంతానికి వెళ్లకుండా గ్రిల్స్, ఇనుప కంచె ఏర్పాటులేవీ లేకపోవడంతో తెలియని వారు వచ్చి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల్లో ఇవాళ నాలుగు మృతదేహాలు(Dead bodies found) లభ్యమయ్యాయి. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం రోజున మానేరు వాగు చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లగా... వారిలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు((missing in Manair check dam). ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు.