తెలంగాణ

telangana

ETV Bharat / crime

న్యాయవాద దంపతుల హత్యకేసులో మరొకరు అరెస్ట్​ - peddapally district crime news

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. హత్య చేసేందుకు కుంట శ్రీనును ప్రోత్సహించిన వ్యవహారంలో నీటిపారుదల విశ్రాంత డిప్యూటీ డీఈఈ వెల్ది వసంతరావు అరెస్ట్​ అయ్యారు.

high court lawyers murder case
న్యాయవాద దంపతుల హత్యకేసులో మరొకరు అరెస్ట్​

By

Published : Mar 19, 2021, 10:19 AM IST

పెద్దపల్లి జిల్లాలో గత నెలలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడు వెల్ది వసంతరావును పోలీసులు అరెస్ట్​ చేశారు.

గుంజపడుగు గ్రామానికి చెందిన వసంతరావు.. నీటిపారుదల శాఖలో డిప్యూటీ డీఈఈగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు. 2018లో పదవీ విరమణ చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో కుంట శ్రీనును.. వెల్ది వసంతరావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్​చేసిన పోలీసులు వారిని రిమాండ్​కు తరలించారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details