తెలంగాణ

telangana

By

Published : May 23, 2021, 7:05 AM IST

ETV Bharat / crime

కరెంటు తీగలు తగిలి పశువులు మృతి

విద్యుదాఘాతంతో లక్షల విలువైన పశువులు మృత్యువాత పడ్డాయి. సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​ మండల కేంద్రంలో విద్యుత్​ తీగలు తగిలి 7 పశువులు మృతి చెందాయి.

animals died of electric shock
విద్యుదాఘాతంతో పశువులు మృతి

సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్ మండల కేంద్రంలో వ్యవసాయ బావులకు వెళ్లే ఎల్టీ విద్యుత్​ తీగలు తెగి 7 పశువులు మృతి చెందాయి. వాటిలో 6 గేదెలు, ఒక ఎద్దు ఉన్నాయి. పది రోజుల కిందట ఇదే మండలంలోని జల్మల్​కుంట తండాలో 5 పశువులు విద్యుదాఘాతంతో మృతి చెందాయి.

మండల కేంద్రం నుంచి దుబ్బతండాకు వెళ్లే దారిలో ఉన్న ఎస్​ఎస్​9- 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్ ఎల్టీ లైన్.. షార్ట్ సర్క్యూట్​తో తెగి కిందపడింది. మేత కోసం వెళ్లిన పశువులకు విద్యుత్​ తీగలు తగిలి మృతి చెందాయి. ఆరుగురు రైతులకు చెందిన ఈ పశువులు మృతి చెందడంతో సుమారు. 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. రైతులకు జరిగిన నష్టానికి విద్యుత్​ అధికారులు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:మూడో దశ వ్యాక్సినేషన్​​కు సిద్ధమవుతున్న ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details