Anganwadi: పాపం ఆ చిన్నపిల్ల ఏం చేసింది. అభంశుభం తెలియని పిల్లలపై ఎందుకీ ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు గుర్తుకు వస్తే ఇలాంటి పనులు చేయడం మానివేస్తారు. సభ్యసమాజం తలదించుకునేలా చిన్నారిపై అమానుష ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో జరిగింది.
మధిర శివాలయం రోడ్డులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోని పనిచేస్తున్న 'ఆయా' రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. చిన్నారి తరచూ మూత్రానికి వెళ్తోందని మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టింది. చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో... ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపను ఇబ్బందిపెట్టిన అంగన్‌వాడీ ఆయాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.