తెలంగాణ

telangana

ETV Bharat / crime

AP Police news: గోధ్రాలో ఏపీ పోలీసుల సోదాలు.. భద్రతా రహస్యాల కేసులో ఒకరు అరెస్టు

గుజరాత్‌లోని గోధ్రాలో ఏపీ పోలీసులు(AP Police news) సోదాలు నిర్వహించారు. భద్రతా రహస్యాల కేసులో భాగంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్​కు తీసుకురానున్నారు.

AP Police news, andhra pradesh police
గోధ్రాలో ఏపీ పోలీసుల సోదాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు

By

Published : Oct 27, 2021, 9:19 AM IST

దేశ భద్రత రహస్యాలను నౌకాదళ అధికారులు పాకిస్థాన్‌కు అమ్ముకుంటున్న కేసులో.. గుజరాత్‌లోని గోధ్రా నగరంలో ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు(AP Police news) ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ నగరంలోని మొహమ్మదీ మొహల్లా ప్రాంతానికి చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌ హరూన్‌ను అరెస్టు చేసి గోధ్రా సెషన్స్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ట్రాన్సిట్‌ రిమాండు మంజూరు చేయడంతో అతడిని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురానున్నారు. అతడి వద్ద వివిధ కంపెనీలకు చెందిన పలు సిమ్‌కార్డులు ఉన్నాయి. వివిధ పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో అతడికి సంబంధం ఉందని, వాళ్ల కోసమే ఇతడు భారతీయ సిమ్‌కార్డులు తీసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

వలపు వల

భారతీయ భద్రతాదళాలకు వలపు వల విసిరేందుకు వాట్సప్‌ కోసం ఇతడి వద్ద ఉన్న ఫోన్లకు వచ్చే ఓటీపీలు వాడుకునేవారు. ఆ వాట్సప్‌ ద్వారానే వలపువల సందేశాలు పంపేవారు. 2016లో తాను పాకిస్థాన్‌ వెళ్లి, అక్కడ 26 రోజులు ఉన్నట్లు హరూన్‌ పోలీసు విచారణలో వెల్లడించాడు. ఆ సమయంలో పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు, ఉగ్రవాద సంస్థల నేతలనూ కలిశాడు. హరూన్‌తో పాటు మరో ఐదుగురిని ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధులు.. భారత నౌకాదళంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకుని వారికి వలపు వల విసిరి.. వారి ద్వారా దేశభద్రత రహస్యాల్ని తెలుసుకుంటున్న విషయం 2019 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించి కేసు నమోదుచేసింది.

విశాఖ గూఢచర్య రాకెట్‌ కేసుగా ఇది పేరొందింది. దాని దర్యాప్తు బాధ్యతల్ని ఆ తర్వాత ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో గోధ్రాకు చెందిన వారినే ఎన్‌ఐఏ అప్పట్లో అరెస్టుచేసింది. తాజాగా అదే ప్రాంతంలో అరెస్టులు చేయడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి:Minister Prashanth reddy: ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యమందించడమే సీఎం లక్ష్యం: ప్రశాంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details