SMUGGLING IN INDIA 2021 2022 REPORT : దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలలో అత్యధికశాతం ఏపీలోనే దొరికినట్లు 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా' 2021-22 నివేదిక తెలిపింది. దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో 18 వేల కిలోల డ్రగ్స్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. వెయ్యి కిలోల గంజాయి, 97 కోట్ల రూపాయల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
'షాకింగ్ న్యూస్: ఏపీలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అధికం'
SMUGGLING IN INDIA 2021 2022 REPORT : 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా' 2021-22 నివేదికను కేంద్రం విడుదల చేసింది. దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలలో అత్యధికశాతం ఏపీలోనే దొరికినట్లు నివేదికలే తేలింది.
'స్మగ్లింగ్ ఇన్ ఇండియా' రిపోర్ట్.. ఏపీనే టాప్..
తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 17 వేల 394 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది. 20 వేల 64 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను రెవెన్యూ ఇంటిలిజన్స్ విభాగం సీజ్ చేసింది. వీటితోపాటు 13వందల 23 కోట్ల రూపాయల విలువైన బంగారం, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మెుత్తం 34 వేల కిలోల డ్రగ్స్, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు నివేదిక తెలిపింది.