ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
బస్సు బోల్తా ఒకరు మృతి... 30 మందికి గాయాలు - బస్సు బోల్తా ఒకరు మృతి 30 మందికి గాయాలు
ఏపీలోని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు.
బస్సు బోల్తా ఒకరు మృతి... 30 మందికి గాయాలు
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.