నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్‌ను అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఓ కరోనా పాజిటివ్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తుతున్న అంబులెన్స్ బైక్‌ను ఢీకొట్టింది.
బైక్‌ను ఢీకొన్న అంబులెన్స్.. ఇద్దరికి గాయాలు - నిజామాబాద్ జిల్లా నేర వార్తలు
బైక్‌ను అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బైక్‌ను ఢీకొన్న అంబులెన్స్
అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు, బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం ధ్వంసమైంది.
ఇదీ చదవండి:గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన