తెలంగాణ

telangana

ETV Bharat / crime

అధిక వడ్డీ పేరుతో అమరావతి రైతులను మోసగించిన వ్యాపారి.. ఇంటి ముందు బాధితుల ధర్నా - Telangana Crime News

Amaravati farmers were cheated by Adilabad businessman: మూలుగుతున్న నక్కపై తాటిపండు వచ్చిపడినట్లు ఇప్పటికే ఏపీ రాజధాని కోసమని భూములు ఇచ్చి దేశ రాజధానితో పాటుగా ఆంధ్రప్రదేశ్​లో ర్యాలీలు చేస్తున్న కొందరు రైతులకు ఇప్పుడు పెద్దకష్టం వచ్చింది. గత ప్రభుత్వ హయంలో రాజధాని కోసమని భూములు అమ్మగా వచ్చిన డబ్బులు అధిక వడ్డీకి ఆశపడి ఆదిలాబాద్​కు చెందిన వ్యాపారికి ఇచ్చి మోసపోయారు. అసలు ఏం జరిగిందంటే..!!

Amaravati farmers were cheated by Adilabad businessman
Amaravati farmers were cheated by Adilabad businessman

By

Published : Jan 23, 2023, 8:30 PM IST

Amaravati farmers were cheated by Adilabad businessman: వాళ్లు అందరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమని వారి వంతుగా సాయం చేసిన అన్నదాతలే.. రేపటి ఆ రాష్ట్ర భవిష్యత్​ కోసం వారికున్న కొద్దిపాటి పోలాలు అమ్ముకొని దేశ రాజధానిలో గర్జించిన రైతులే.. ఇప్పడు అమరావతి విశిష్టతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న కర్షకులే.. పాపం అలాంటి రైతుల్లో కొందరు అధిక వడ్డి ఇస్తానని ఎర వేసి మాయమాటులు చెప్పిన ఓ వ్యాపారి చేతిలో మోసపోయారు. వారు చేసిన చిన్న పొరపాటు పని ఇప్పుడు వారి కుటుంబాల్లోగాని వారిలో గానీ సంతోషం లేకుండా చేస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..: గత ప్రభుత్వం హయంలో ఆంధ్రప్రదేశ్​ రాజధాని కోసమని ప్రభుత్వం భూములు సేకరించింది. దీంతో అమరావతి ప్రాంతం చుట్టుపక్కల రైతులు తమ భూములకు విలువ పెరుగుతుందని ప్రభుత్వానికి ఇచ్చారు. కొందరు ఎవరి ప్రమేయం లేకుండా ఉచితంగా కూడా ఇచ్చారు. వాటికి ప్రభుత్వం లెక్క ప్రకారం పరిహారం ఇచ్చింది. ఇది సమయంలో రైతుల అమాయకత్వం ఆసరాగా చేసుకొని ఆదిలాబాద్​కు చెందిన వ్యాపారి ఒకరు అక్కడ ప్రత్యక్షమై అధిక వడ్డీ ఎరచూపాడు.

అతను మాయమాటలను నమ్మిన రైతులు వడ్డీకి ఆశపడి మధ్యవర్తి ప్రమేయం లేకుండా అతనికి ఇచ్చేచారు. ఆ తర్వాత వ్యాపారి వద్దకు వచ్చి డబ్బులు అడగ్గా రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అంటూ సమయం నెట్టుకొస్తున్నాడు. దీంతో రైతులు ఆగ్రహించి ప్రత్యేక బస్సులో వ్యాపారి స్వస్థలం ఆదిలాబాద్​కు వచ్చారు. ఆయన ఇంటి ముందు బైఠాయించారు. సదరు వ్యాపారి లేకపోవడంతో అతను వచ్చినంతవరకూ ఇంటే ముందే కూర్చొని ఉంటామని రైతలు తేల్చి చెప్పారు.

"నేను చాలా ధనవంతుడ్ని. నా దగ్గర కార్లు ఉన్నాయి. చాలా మిల్లులు ఉన్నాయని చెప్పాడు. మీ డబ్బులు నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచుతానని మమ్మల్ని మోసం చేశాడు. దీంతో ఒక్కొక్కరం పది లక్షలు, ఇరవై లక్షలు ఇలా సుమారు ఆరు కోట్లు వరకు ఇచ్చిమోసపోయాం. గత రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇస్తామంటూ కాలం వెల్లదిస్తూ వస్తున్నాడు. మా ఇంటి దగ్గర సమస్యలు ఎక్కువ కావడంతో మేము అమరావతి నుంచి ఈ రోజు ప్రత్యేక బస్సులో ఇక్కడికి వచ్చాం. ఆయన ఏమో హైదరాబాద్​ వెళ్లిపోయారంటూ ఇంటి దగ్గర ఆడవాళ్లు అంటున్నారు. ఏదిఏమైనా మా డబ్బులు తీసుకొని వెళ్లేంతవరకూ ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాం."- బాధిత రైతు

అధిక వడ్డి పేరుతో అమరావతి రైతులను మోసగించిన వ్యాపారి.. ఇంటి ముందు రైతులు ధర్నా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details