తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏపీలో ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ ఆత్మహత్య.. కారణమేమిటంటే..! - Andhra Pradesh Latest News

Engineering College Chairman Commits Suicide: నరసరావుపేటలోని అమరా ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ వెంకటేశ్వర్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకర్ల ఒత్తిడే తన భర్త ఆత్మహత్యకు కారణమని ఆయన భార్య ఆరోపించారు.

Engineering College Chairman Commits Suicide
Engineering College Chairman Commits Suicide

By

Published : Jan 31, 2023, 2:13 PM IST

Engineering College Chairman Commits Suicide: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమరా ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ అమరా వెంకటేశ్వరావు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగిన ఆయన్ను.. బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కోర్టును ఆశ్రయిస్తే.. తాళం వేసుకోవచ్చని తీర్పు: అమరా వెంకటేశ్వరరావు భార్య సుధారాణి తెలిపిన వివరాల ప్రకారం.. 2011వ సంవత్సరంలో కెనరా బ్యాంకు నుండి కళాశాల తరపున రూ.13 కోట్లు అప్పుతీసుకున్నారు. 2017 వరకు రూ.25 కోట్లను తిరిగి చెల్లించామని వివరించారు. అయితే అప్పటికీ అప్పు తీరలేదని బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయిస్తే కళాశాలలో సాామగ్రిని యాజమాన్యానికి అప్పగించి కళాశాలకు తాళం వేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు.

కానీ, కెనరా బ్యాంకు అధికారులు కళాశాలలో సామగ్రిని ఇవ్వకుండా మొత్తం సీజ్ చేశారని ఆరోపించింది. అప్పటినుండి నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులో కెనరా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి వివరాలు తెలిపినా ఏ ఒక్క బ్యాంకు అధికారి స్పందించలేదని వాపోయింది. 2017 నుండి ఇప్పటి వరకూ నోటీసులు పంపి మమ్మల్ని వేధిస్తున్నారని అమరా వెంకటేశ్వరరావు భార్య అమరా సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాలలో ఉన్న తమ సామగ్రి విక్రయించినా సుమారు రూ.16కోట్లు వస్తాయని వాటితో బ్యాంకు అప్పు తీరుతుందని తెలిపింది. కానీ బ్యాంకు అధికారులు మా మొర ఆలకించకుండా కళాశాలను అమ్మకానికి వేలం పెట్టారని దీంతో తన భర్త అమరా వెంకటేశ్వరరావు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారని వెల్లడించింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details