తెలంగాణ

telangana

ETV Bharat / crime

మాంత్రికుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్ - వ్యక్తి హత్య వార్తలు

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని న్యూ సాంగ్వీ గ్రామం సమీపంలో ఈ నెల 4న గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి... హత్య కేసును ఛేదించారు.

adilabad police chase murder mystery
మాంత్రికుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

By

Published : Mar 11, 2021, 7:59 AM IST

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన సమగ్ర బేగం భర్త విదేశాల నుంచి వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆదిలాబాద్​కు తీసుకెళ్తుండగా... బస్సులో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తెలిసిన మాంత్రికుడు ఉన్నాడని... అతని పేరు చాంద్​ఖాన్​ అని... అతనిని కలిస్తే నీ భర్తకు నయం అవుతుందని తెలిపాడు. దీంతో దంపతులు మంత్రికుడిని కలిశారు. చేతబడి చేశారని... నయం చేస్తానని యాభైవేలు తీసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత సమగ్ర బేగం భర్త మృతిచెందాడు. దీంతో చాంద్ ఖాన్ తనను పెళ్లి చేసుకోవాలని సమగ్ర బేగంపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో భర్తను చంపినట్లే కొడుకును చంపేస్తానని బెదిరించాడు. భయపడిన సమగ్ర బంధువులకు విషయం చెప్పి మాంత్రికుడి హత్యకు పథకం రూపొందించారు. పథకం ప్రకారం చాంద్ ఖాన్​ను మామడ మండలంలోని న్యూ సాంగ్వీ గ్రామానికి రప్పించి... చికెన్​లో నిద్రమాత్రలు కలిపి తినిపించారు. మత్తులోకి జారుకున్నాక అక్కడే ఉన్న బంధువులు కర్రలు, రాళ్లతో మోది హత్య చేసారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యారు.

మృతుడి కాల్ డేటా ఆధారంగా సమగ్ర బేగంను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ జీవన్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిన భార్య

ABOUT THE AUTHOR

...view details