హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని మారుతి నగర్లో యాసిడ్ ట్యాంక్ పేలింది. రసాయన ద్రావణాలు వీధుల్లోకి చేరడంతో పలువురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక నేతలు ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు.
అంబర్‌పేట్‌లో పేలిన యాసిడ్ ట్యాంక్.. తప్పిన ప్రమాదం - acid tank explotion in amberpet news
అంబర్పేట్ నియోజకవర్గంలోని మారుతీనగర్‌లో యాసిడ్ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
అంబర్‌పేట్‌లో పేలిన యాసిడ్ ట్యాంక్
ప్రమాదకరమైన యాసిడ్ ఫ్యాక్టరీని జనావాసాల నడుమ అక్రమంగా నడుపుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.