తెలంగాణ

telangana

Realtor murder case: రియల్టర్​ హత్య కేసులో షాకింగ్​ నిజాలు.. చంపింది తమ్ముడే..!

Realtor murder case:స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లో చేధించారు. వ్యాపారంలో తలెత్తిన విభేదాలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తేల్చారు. ఏజెంట్​గా పనిచేస్తున్న సమీప బంధువే వ్యాపారిని కాల్చి చంపినట్టు దర్యాప్తులో తేలగా.. నిందితున్ని పోలీసులు అరెస్ట్​ చేశారు.

By

Published : Dec 1, 2021, 5:03 PM IST

Published : Dec 1, 2021, 5:03 PM IST

Accused Arrested in Realtor murder case in thirumalgiri
Accused Arrested in Realtor murder case in thirumalgiri

Realtor murder case: హైదరాబాద్​ తిరుమలగిరి పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. వ్యాపారంలో విభేదాలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తేల్చారు. తన దగ్గర ఏజెంట్​గా పనిచేసే నరేందర్​రెడ్డే... విజయ్​భాస్కర్​ను కాల్చి చంపినట్టు దర్యాప్తులో తెలిసింది. ఇద్దరి మధ్య కమీషన్​ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ వల్లే.. నిందితుడు కక్ష పెంచుకుని హత్య చేసినట్టు సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు.

Real estate agent vs Realtor: స్థిరాస్థి వ్యాపారి విజయ్ భాస్కర్ ఇళ్ల స్థలాలు విక్రయిస్తుంటాడు. నరేందర్​ రెడ్డి తన దగ్గర ఏజెంట్​గా పనిచేస్తున్నాడు. విజయ్​భాస్కర్​రెడ్డికి నరేందర్​రెడ్డి సమీప బంధువు కాగా.. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇదే కాకా.. నరేందర్​ క్యాబ్​ డ్రైవర్​గానూ పని చేస్తున్నాడు. నరేందర్ రెడ్డి సరిగా వ్యవహరించక పోవడం వల్ల విజయ్​భాస్కర్​రెడ్డి తరచూ అవమానించేవాడు. ఓ స్థలం అమ్మగా.. కమీషన్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి విజయ్​భాస్కర్​పై కక్ష పెంచుకున్న.. నరేందర్​ హతమార్చేందుకు కుట్ర పన్నాడు. అందుకు రూ.30 వేలతో రెండు నాటు తుపాకులు కొన్నాడు.

murder with local gun: నవంబర్​ 29న ఓ ఇంటి స్థలం ఉందని.. విజయ్​భాస్కర్​రెడ్డికి నరేందర్​రెడ్డి ఫోన్ చేశాడు. వెంటనే విజయ్​భాస్కర్​ తొమ్మిదిన్నర లక్షలు తీసుకొని ఇంటి నుంచి బయల్దేరాడు. మార్గ మధ్యలో నరేందర్​రెడ్డి కారులో ఎక్కాడు. ఆ తర్వాత ఆర్టీసీ కాలనీ వైపు తీసుకెళ్లి.. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్చేశాడు. చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత.. దాదాపు 5 గంటల పాటు మృతదేహాన్ని కారులోనే పెట్టుకొని పలుచోట్ల తిరిగాడు. విజయ్​భాస్కర్​ దగ్గరున్న తొమ్మిదిన్నర లక్షలను తీసుకున్నాడు. హత్యకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. మృతదేహాన్ని, కారును అక్కడే వదిలి పరారయ్యాడు. విజయ్​భాస్కర్​రెడ్డి చరవాణితో పాటు.. నాటు తుపాకీని కొంత దూరంలో పడేసి వెళ్లాడు.

police arrest an accused: విజయ్​భాస్కర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అదే రోజు రాత్రి 10.30 గంటలకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా ఆర్టీసీ కాలనీలో మృతదేహం కనిపించింది. కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు.. సాంకేతికత ఆధారంగా నిందితుడు నరేందర్​రెడ్డిని అరెస్ట్​ చేశారు. నిందితుని దగ్గర్నుంచి రెండు తుపాకులు, నగదుతో పాటు.. చరవాణీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details