A car being on fire in AP: సాఫీగా సాగిపోయే ప్రయాణంలో ఒక్కసారిగా అలజడి రేగింది. గమ్యస్థానానికి చేరుకోకముందే కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి అపాయం జరగకపోయినప్పటికీ.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగర శివార్లలోని తిరుచానూరు పైవంతెన మీద కారు దగ్ధమయ్యింది. శ్రీకాళహస్తి నుంచి చంద్రగిరికి వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో పొగలు వ్యాపించడంతో కారును పక్కన ఆపి కిందకు దిగాడు. కొద్దిసేపటి తర్వాత కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది.
కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సురక్షితం.. ఎక్కడంటే..? - కారులో మంటలు చెలరేగిన వీడియోలు
A car being on fire: అప్పటివరకు రోడ్డుపై రయ్‌మంటూ వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే వాహనాన్ని పక్కన ఆపి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకునేలోపే కారు దగ్ధమైంది. కారు నుంచి ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.
కారులో చెలరేగిన మంటలు
పైవంతెన మీద కారు తగలబడుతుందన్న సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కారులో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: