ముందు రోడ్డు ప్రమాదం.. వెనక ట్రాఫిక్ జాం.. 2 లారీల మధ్యలో ఇరుక్కుపోయిన బొలేరో.. - గద్వాల తాజా వార్తలు
08:06 June 05
ముందువెళ్తున్న కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
Road Accident: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రేమ్‌రాజ్ మృతిచెందారు. 43 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కర్నూల్‌కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఇటిక్యాల మండలం వేముల సమీపంలో... ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా.. మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఉన్న బొలెరో వాహనం ఇరుక్కుపోవడంతో... బొలెరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్..!