Young Woman Commits Suicide: దుర్గం చెరువులోకి దూకి స్వప్న అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అలా కేబుల్ బ్రిడ్జి పైనుంచి నడుచుకుంటూ వచ్చిన స్వప్న ఒక్కసారిగా చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే కొందరు సందర్శకులు ఆమె దూకడాన్ని గమనించి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ ఆమె ఆచూకీ కనిపించలేదు.
స్వప్న దూకిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. యువతి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించినట్లు.. ఆమె వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉండవచ్చని అక్కడ చూసిన సందర్శకులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. స్పీడ్ బోట్స్తో చెరువులో గాలిస్తున్నారు.