Young Man Died: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కొట్టాడని మనస్థాపం చెందిన ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఘనపురానికి చెందిన పెండ్యాల ప్రశాంత్... ఓ గొడవ విషయంలో పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కాగా... తనను పోలీసులు మళ్లీ స్టేషన్‌కు రావాలని చెప్పటంతో భయాందోళనకు గురైన ప్రశాంత్ ఈ నెల 12న పురుగుల మందు సేవించాడు.
ఎస్ఐ కొట్టాడని... పురుగుల మందు సేవించి యువకుడు ఆత్మహత్య - పురుగుల మందు తాగి యువకుడు మృతి
Young Man Died: పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ కొట్టాడని మనస్థాపానికి గురై... ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Young Man Died
చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈరోజు మృతిచెందాడు. స్టేషన్ ఎస్సై ఉదయ్‌కిరణ్ సర్దిచెప్పకుండా... భయాందోళనకు గురిచేసినందునే తమ బిడ్డ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 10 రోజులుగా చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చుచేసినా ప్రశాంత్ ప్రాణం నిలువలేదని కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:అక్షింతలు వేస్తానని... రాడ్డుతో తలపై కొట్టి చంపిన అర్చకుడు