Suicide Attempt : తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో మండల అభివృద్ధి అధికార కార్యాలయ సిబ్బంది జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడి బలవన్మరణానికి యత్నించాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకుండా గ్రామానికి చెందిన బండి నర్సింలు అనారోగ్యంతో రెండు నెలల క్రితం మృతి చెందాడు. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం మృతుని కుమారుడు బండి శ్రీనివాస్... గ్రామపంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నాడు.
Suicide Attempt : ఎంపీడీవో కార్యాలయం ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం.. - వికారాబాద్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం
Suicide Attempt : ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) ఇవ్వడంలో కార్యాలయ సిబ్బంది జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ.. పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.
Young Man Suicide Attempt
అయితే తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్యాలయ సిబ్బంది తన తండ్రి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ.. దోమ ఎంపీడీవో కార్యాలయం ఎదున నిరసనకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వండంలో జాప్యం చేస్తున్నారని యువకుడితో కలిసి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు
ఇదీ చూడండి :మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే..!