దంపతుల మధ్య మనస్పర్థలు రావడం వల్ల వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో జరిగింది. గ్రామానికి చెందిన సావిత్రి అపర్ణ(19) అదే గ్రామానికి చెందిన రాజు... ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి గ్రామంలోనే గుడిసె వేసుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Suicide: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య - మేడ్చల్ నేర వార్తలు
మేడ్చల్ ఠాణా పరిధి కండ్లకోయలో విషాదం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకుని వివాహిత (19) ఆత్మహత్య చేసుకుంది.
women suicide
కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఏమైందో ఏమో కాని ఇవాళ ఉదయం తన గుడిసెలో ఉరి వేసుకొని సావిత్రి ఆత్మహత్య చేసుకుంది. తమ బిడ్డను భర్తే హత్య చేశాడని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Fire Accident: కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సేఫ్