ప్రేమించిన మరదలిపైనే అనుమానం పెంచుకున్నాడు ఓ దుర్మార్గుడు. అదే అక్కసుతో గొంతు నులిమి ఆ యువతిని హత్య చేశాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఏవీబీపురంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే...
ప్రేమించిన మరదలిపైనే అనుమానం పెంచుకున్నాడు ఓ దుర్మార్గుడు. అదే అక్కసుతో గొంతు నులిమి ఆ యువతిని హత్య చేశాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఏవీబీపురంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే...
కూకట్‌పల్లి హబీబ్‌నగర్‌లో నివాసముండే సోమేశ్వరరావు చిన్న కూతురు మంజుల(19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. ఏవీబీపురంలో నివసించే భూపతి(21) బీటెక్ రెండో సంవత్సరంలో చదువు ఆపేసి ఇంట్లో ఉంటున్నాడు. మంజులకు భూపతి బావ వరస అవ్వటంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కొంతకాలంగా యువతిపై అనుమానం పెంచుకుని ఆమెతో తరచు గొడవ పడేవాడు. శనివారం మధ్యాహ్నం మాట్లాడుకుందామంటూ యువతిని తన గదికి రప్పించుకున్నాడు. అక్కడే ఇద్దరికి గొడవ జరగటంతో గొంతు నులిమి మంజులను చంపేశాడు భూపతి.
మృతదేహాన్ని నీటిసంపులో పడేశాడు..
హత్య విషయం బయటకు రాకూడదని మృతదేహాన్ని నీటి సంపులో పారేసిన భూపతి... భయంతో అదే రోజు సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండుకు పంపారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.