తెలంగాణ

telangana

By

Published : May 4, 2021, 8:16 PM IST

ETV Bharat / crime

జాబ్​ మారాలనుకుంటే... జీతం ఊడ్చేశారు

ఉద్యోగం మారాలనుకున్న ఓ మహిళను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఆన్​లైన్ జాబ్​ పోర్టల్ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలంటూ నమ్మించి ఖాతా కొల్లగొట్టారు. దీంతో హైదరాబాద్​లోని బాలానగర్ ఫిరోజ్​గూడకు చెందిన మహిళా ఉద్యోగి ద్వారా పోలీసులను ఆశ్రయించింది.

A women cheated in  cyber fraud
మహిళా ఉద్యోగిని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

ఆన్​లైన్​ జాబ్​పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ పేరుతో మోసానికి పాల్పడ్డారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్​లోని​ బాలానగర్ ఫిరోజ్​గూడకు చెందిన సంతోషి కుమారి అనే యువతి ఖాతా నుంచి రూ.17,665 మాయం చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మోసపోయిందిలా...

ఉద్యోగం మారడానికి గత నెలలో నౌకరి.కామ్​లో ఉద్యోగాల కోసం వెతికింది. దీంతో ఆ మహిళకు నౌకరి.కామ్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్ చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అందుకోసం ఫీజు రూ.25 చెల్లించాలనడంతో సంతోషి కుమారి నమ్మింది. రిజిస్ట్రేషన్ కోసం తన డెబిట్ కార్డు ద్వారా యత్నించగా తన అకౌంట్​లో డబ్బులు లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించింది.

ఇదీ చూడండి:నేతల పరస్పర విమర్శలు... బయటపడుతున్న తెరాస రహస్యాలు..!

ABOUT THE AUTHOR

...view details