woman suicide attempt: చర్చి పాస్టర్ పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ట్యాబ్లెట్లు, ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి ముందు తన చావుకు కారణమైన వారి పేర్లతో లేఖ కూడా రాసింది.
woman suicide attempt: పాస్టర్ మోసం చేశాడని మహిళ ఆత్మహత్యాయత్నం - telangana crime news
woman suicide attempt: పెళ్లి చేసుకుని పాస్టర్ మోసం చేశాడని ఓ మహిళ బలవన్మరణానికి యత్నించింది. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. న్యాయం చేయాలని కోరుతూ రెండు నెలలుగా తన కుమారునితో కలిసి చర్చి ఎదుట ఆమె నిరసన దీక్ష చేపట్టింది. అయినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది.
మహిళ ఆత్మహత్యాయత్నం
సారపాకకు చెందిన చర్చి పాస్టర్ సువర్ణ రాజు 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఇప్పుడు తనెవరో తెలియదంటున్నాడని బాధితురాలు సులోచన ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం బాధితురాలు గత రెండు నెలలుగా చర్చి ఎదుట తన తొమ్మిదేళ్ల కుమారునితో కలిసి నిరసనకు దిగింది. చర్చి ఎదుట చిన్న షెల్టర్ వేసుకుని నిరసన చేపట్టింది. చాలా రోజులుగా పరారైన చర్చి పాస్టర్ సువర్ణ రాజు కొన్ని రోజుల క్రితమే సారపాక వచ్చాడని ఆమె తెలిపింది.
ఇదీ చూడండి: