Chain Snatching: లిఫ్ట్ అడిగింది.. చైన్ కొట్టేసింది... - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
11:14 November 16
కానిస్టేబుల్ మెడలో గొలుసు కొట్టేసిన మహిళ
హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్‌ను లిఫ్ట్ అడిగింది ఓ మహిళ. ద్విచక్రవాహనం మీద వస్తున్న కానిస్టేబుల్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. తను వెళ్లాల్సింది అక్కడికే అంటూ పంజాగుట్ట జంక్షన్‌లో దిగిపోయింది. ఈలోపే బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ మెడలోని గొలుసు మాయమైంది. ఇంతకీ ఏం జరిగింది?
లిఫ్ట్ అడిగి.. చైన్‌తో పరార్
కానిస్టేబుల్ మెడలో గొలుసు కొట్టేసింది ఓ మహిళ. తన ద్విచక్రవాహనంపై కానిస్టేబుల్ మహిళకు లిఫ్ట్ ఇవ్వగా... పంజాగుట్ట జంక్షన్‌లో ఆ కిలాడీ మహిళ దిగిపోయింది. అనంతరం కానిస్టేబుల్ మెడలోని బంగారు గొలుసు మాయమైంది. బైక్ మీద కూర్చున్న సమయంలోని చైన్‌ను మాయం చేసిందని కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:Dead bodies found: మానేరు వాగులో గల్లంతైన మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం