దారుణం: భార్య, కుమార్తెను హత్య చేసిన భర్త - nizamabad news
10:18 July 23
దారుణం: భార్య, కుమార్తెను హత్య చేసిన భర్త
నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపాడు. కూతురిని కూడా హత్య చేశాడు. రుద్రూర్‌కు చెందిన గంగాధర్.. కొంతకాలంగా భార్య మల్లీశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు.
ఇటీవల కులపెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో సయోధ్య కుదిర్చారు. అయినప్పటికీ మనసు మార్చుకోని గంగాధర్.. రాత్రి భార్య మల్లీశ్వరి, కూతురు ప్రుత్వికను నరికి చంపాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కృష్ణా నదిలో దూకిన కుటుంబం.. బాలుడి మృతదేహం లభ్యం