తెలంగాణ

telangana

ETV Bharat / crime

డబ్బు కోసం.. కూతురి పిల్లలను కిడ్నాప్ చేసిన తల్లి!

Miyapur boys Kidnap case : ఇటీవల కాలంలో డబ్బు కోసం ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నారు. మానవతా విలువలు మరిచిపోయి... అయిన వారు అని కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పైసల కోసం ఓ తల్లి ఏకంగా కూతురి పిల్లలను కిడ్నాప్ చేసింది. మనవళ్లతో ముద్దు ముద్దు ముచ్చట్లతో ఆటలాడుకోవాల్సిన అమ్మమ్మ... ఇద్దరు చిన్నారులను తల్లికి దూరం చేసింది. రూ.30 లక్షలు ఇస్తేనే పిల్లలను పంపుతానంటూ బెదిరిస్తోంది.

Miyapur boys Kidnap case, grand ma kidnap kids
డబ్బు కోసం.. కూతురి పిల్లలను కిడ్నాప్ చేసిన తల్లి!

By

Published : Feb 17, 2022, 12:57 PM IST

Miyapur boys Kidnap case : రంగారెడ్డి జిల్లా మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డబ్బు కోసం సొంత తల్లి...చిన్న కుమార్తె పిల్లలను... పెద్ద కుమార్తెతో కలిసి కిడ్నాప్‌ చేసింది. పిల్లలు కనిపించడం లేదంటూ తల్లి మియాపూర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది.

ఏం జరిగింది?

బాధితురాలు రుహి మియాపూర్‌లోని మదీనాగూడలో ఉంటూ... ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె భర్త ఏడాదిన్నర కిందట గుండె పోటుతో చనిపోవడంతో.... తల్లి, అక్కను తన వద్దే ఉంచుకుని పోషిస్తున్నారు. జనవరిలో తల్లి, అక్క... ఇద్దరు పిల్లలను, ఇంట్లోని ధ్రువపత్రాలను తీసుకుని... తమ సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకువెళ్లారు. పిల్లలు, తల్లి, అక్క ఆచూకీ తెలియక రుహి.... హైదరాబాద్‌లోని పలువురు బంధువుల ఇళ్లలో వెతికారు. తమ పిల్లలను... సొంత ఊరు తీసుకెళ్లారని తెలుసుకుని... అక్కడకు వెళ్లి... తమ పిల్లలను పంపించాలని కోరితే... బంధువులు దాడి చేశారని తెలిపారు.

బంధువుల దాడి

పిల్లల ఆచూకీ కోసం సత్తుపల్లికి వెళ్తే... అక్కడ కూడా పిల్లలు, తన తల్లి, అక్కా లేరని... ఊళ్లోని బంధువులు కొందరు తనపై దాడి చేశారని వాపోయారు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఫోన్, నగదు, బంగారం కూడా లాక్కున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కారు ఊళ్లో వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. పిల్లలను తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయిన తల్లి... ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని రుహి వాపోయారు. డబ్బులు ఇస్తేనే పిల్లలను వదిలేస్తామంటూ... బంధువులకు చెప్పినట్లు వివరించారు. ఇంతవరకు పిల్లలను తనకు చూపించలేదని... పిల్లలు ఎక్కడ ఉన్నారో... ఎలా ఉన్నారో... తెలియడం లేదంటూ బోరున విలపిస్తున్నారు.

న్యాయం చేయండి..

హైదరాబాద్ నగరానికి వచ్చిన డాక్టర్ రుహి... మియాపుర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సత్తుపల్లిలో ఫిర్యాదు చేయాలని చెప్పారని... ఇక్కడ కేసు నమోదు చేయలేదని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమ్మం సీపీని కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే... కిడ్నాప్ మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని.. అక్కడికే వెళ్లమని అక్కడికి ఇక్కడికి తిప్పారని వాపోయారు. చివరికి మియాపుర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలను కిడ్నాప్ చేసి ఇరవై రోజులు గడిచినా.... తనకు న్యాయం జరగలేదని రుహి కంటతడి పెట్టుకున్నారు. తన పిల్లలను ఆమె తల్లి, అక్క చెర నుంచి విడిపించి... న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా బాధితురాలి మేనమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు.

నా భర్త గుండెపోటుతో ఏడాదిన్నర క్రితం చనిపోయారు. మా అమ్మ, అక్క నా ఇంటికి వచ్చారు. పిల్లలను చూసుకుంటామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి నా ఇంట్లోనే ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో నా పిల్లలు, సర్టిఫికెట్లను తీసుకెళ్లారు. నా బంగారం, క్యాష్ అన్నింటిని కూడా తీసుకొనిపోయారు. వాళ్ల దూరపు బంధువు సాయంతో నా పిల్లలను కిడ్నాప్ చేశారు. నా స్నేహితుల సాయంతో పిల్లల కోసం అటూ ఇటూ తిరిగాను. తెలిసిన వాళ్ల ఇంట్లో వెతికాను. చివరకు సొంతూరిలో ఉన్నారని తెలిసింది. నేను వెళ్లాను. అక్కడ నామీద దాడి చేశారు. ఏటీఎం, పాన్, కార్ కీస్ తీసుకున్నారు. పిల్లలను నాకు చూపించలేదు. డబ్బులు డిమాండ్ చేశారు. పోలీసుల వద్దకు తిరిగి తిరిగి... కంప్లైంట్ చేశాను. దయచేసి నా పిల్లలను నా దగ్గరకు చేర్చండి.

-రుహి, పిల్లల తల్లి

ఇదీ చదవండి:Lovers Jumped Into Canal in Huzurabad : కాకతీయ కాల్వలోకి దూకిన ప్రేమజంట

ABOUT THE AUTHOR

...view details