Minor Girl Rape case: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన బాలికపై కామాంధుల కన్ను పడింది. ఆ బాలికపై అత్యాచారం చేయడంతో పాటు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం కూడా చేయించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది.
ఇంట్లో వారితో గొడవపడి..
lod city in hyderabad: హైదరాబాద్ పాతబస్తీ కిషన్ బాగ్ ప్రాంతానికి బాలిక నవంబర్ 20వ తేదీన ఇంట్లో తన అక్కతో గొడవ పడి బయటకొచ్చింది. డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలిక ఆచూకీ సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి.
ఆటో డ్రైవర్ అతని స్నేహితునితో కలిసి దారుణం
prostitution with girl: ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు రాత్రి బాలిక రోడ్డుపై ఉండగా కొందరు యువకులు వెంబడిస్తే ఓ ఆటో డ్రైవర్ గమనించి ఆకతాయిల నుంచి రక్షించాడు. బాలిక వివరాలను ఆటో డ్రైవర్ ఆరా తీయగా ఇంటికి వెళ్లనని చెప్పడంతో ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితుడు హఫీజ్‌తో కలిసి బాధితురాలిని అత్తాపూర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లారు. ఆపై ఇద్దరు బాలికపై అత్యాచారం చేసి మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఇద్దరు మహిళల సాయంతో ఓ ఇంట్లో ఉంచి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని బహదూర్ పురా సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు.
లోకేషన్ ఆధారంగా..
girl rescued: బాలిక అదృశ్యం కేసులో దర్యాప్తు చేస్తున్న బహదూర్ పురా పోలీసులకు బాధితురాలి అక్క ఫోన్‌కు బాలిక లోకేషన్ పంపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మైలార్దేవ్ పల్లి అలీనగర్‌లోని ఓ ఇంట్లో దాడి చేసి బాలికను రక్షించారు. అక్కడే ఉన్న ముఠాలోని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.