ఏపీలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పోలీసు స్టేషన్ పరిధిలో కడపనత్తం గ్రామానికి చెందిన చాను అనే యువకుడు గురువారం ఉదయం.. పక్కింటి యువతిని ఫోన్ నంబరు అడిగాడు. ఆమె నిరాకరించి ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వెంటనే ఆమె తల్లి.. చాను ఇంటి వద్దకు వెళ్లి అతణ్ని హెచ్చరించింది. యువకుడి ప్రవర్తన సక్రమంగా లేదని గ్రామ పెద్దలకు తెలిపింది.
యువతి ఫోన్ నంబరు ఇవ్వలేదని.. తుపాకీతో యువకుడి వీరంగం! - చిత్తూరు జిల్లాలో తుపాకీతే బెదిరించిన యువకుడు
ఫోన్ నంబరు ఇవ్వనందుకు యువతిని బెదిరించాలని ఓ యువకుడు తుపాకీ పేల్చి వీరంగం సృష్టించాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనతో.. బాధితులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తుపాకితో బెదిరింపు, ఏపీలో తుపాకితో బెదిరింపులు, చిత్తూరులో తుపాకితో బెదిరింపులు
ఆ కుటుంబంపై కక్షగట్టిన చాను.. గురువారం రాత్రి నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం సృష్టించాడు. ఫోన్ నంబర్ ఇవ్వకపోతే చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించాడు. అతని అరుపులతో పొరుగింటి వారు వచ్చి ప్రశ్నించగా గన్ పేల్చాడు. ఆ తూటా పక్కింటి తలుపును పాక్షికంగా ధ్వంసం చేసింది. భయాందోళనకు గురైన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.