జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మర్లబీడు గ్రామానికి చెందిన చిన్న రంగారెడ్డి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన సోదరుడుని భార్య, మేనల్లుడు హత్య చేశారని రంగారెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వ్యక్తి అనుమానాస్పద మృతి.. భార్య, మేనల్లుడిపై అనుమానం - తెలంగాణ వార్తలు
ధరూర్ మండలం మర్లబీడు గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి భార్య, మేనల్లుడే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి.. భార్య, మేనల్లుడిపై అనుమానం
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్న పోలీసులు క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం తలవెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య, మేనల్లుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.