వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ బాబు సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది గమనించి అతడిని నిలువరించారు.
ఏం జరిగిందంటే..
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూర్పల్లి గ్రామ సర్పంచ్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యులు ఆయన కాలు తీసేశారు. అప్పటి నుంచి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులను తన బంధువు హనుమంతరావుతో చేయిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు హనుమంతరావు గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల పనులు చేపట్టాడు. ఒక ఎకరం పొలం అమ్మి ఆ పనులను పూర్తి చేశాడు. తీరా బిల్లులు రాకపోవడంతో విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే సరిగా స్పందించకపోవడంతో.. మనస్తాపం చెందిన హనుమంతరావు ఆయన సభలో ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు.