తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్ వీడియో: వదినను చంపిన మరిది - మహళ దారుణ హత్య

భూమి విషయంలో సొంత వదినను నరికి చంపాడో వ్యక్తి. ఈ ఘటన జహీరాబాద్​ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

a-man-killed-his-brothers-wife-on-land-issue-at-huzurabad-in-sanagreddy
వదినను చంపిన మరిది... భూవివాదమే కారణం

By

Published : Mar 22, 2021, 11:12 AM IST

Updated : Mar 22, 2021, 1:23 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలంలోని పస్తాపూర్​లో దారుణం చోటు చేసుకుంది. పస్తాపూర్​ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు షబానావేగం దారుణ హత్యకు గురైంది. ఆదివారం రాత్రి షబానా భర్త జహంగీర్... అతని​ సోదరులు యాకూబ్​, ఖాజాల మధ్య భూమి విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఖాజా కొబ్బరి బొండాలు నరికే కత్తితో షబానా బేగం మెడపై వేటు వేశాడు.

లైవ్ వీడియో: వదినను చంపిన మరిది

తీవ్రంగా గాయపడిన షబానాను చికిత్స నిమిత్తం జహీరాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:మద్యం తాగించి యువకుడి దారుణ హత్య.. నిందితుల అరెస్ట్​

Last Updated : Mar 22, 2021, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details