హైదరాబాద్ మూసారాంబాగ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మోసీన్ అనే వ్యక్తి తన బావ హబీబ్‌ను దారుణంగా హతమార్చాడు.
శుక్రవారం అర్ధరాత్రి హబీబ్ తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా అతని బావమరిది మోసీన్ అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న హబీబ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.