తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్య చితిలో దూకి తనువు చాలించిన భర్త - ఒడిశా

పెళ్లిరోజున చేసే ప్రమాణాల్లో ఒకటైన నాతిచరామిని మరణంలోనూ తూ.చ. తప్పకుండా పాటించాడు ఓ వృద్ధుడు. నిండునూరేళ్లు తనతో ఉంటాను అని చెప్పిన భార్య మధ్యలోనే తనువు చాలిస్తే.. చూసి తట్టుకోలేక ఆమె చితిలోనే దూకి కాలి బూడిదయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండిలో జరిగింది.

wifes funeral
wifes funeral

By

Published : Aug 26, 2021, 3:01 PM IST

భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త... ఆమెకు పేర్చిన చితిలోనే దూకి తనువు చాలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఒడిశా కలహండిలోని సియాల్​జోడి అనే గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నీలామణి సాబర్​ అనే వృద్ధుడు.. తన భార్య అయిన రాయ్​బరి మృతిని తట్టుకోలేకపోయాడు. దీంతో దహనసంస్కారాల సమయంలో ఎవరూ లేని సమయం చూసి మంటల్లోకి దూకాడు.


ఇది జరిగింది..

ఒడిశా కలహండిలోని సియాల్​జోడి అనే గ్రామానికి చెందిన రాయ్​బరి అనే మహిళ మంగళవారం చనిపోయారు. దీంతో ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి శ్మశానవాటికకు తీసుకుని వచ్చారు. సంప్రదాయబద్దంగా చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ నిర్వహించారు. ఆమె కుమారులు నలుగురు చితికి నిప్పంటించారు. ఈ క్రమంలో మంటల్లో కాలిపోతున్న తన అర్ధాంగిని చూసి తట్టుకోలేకపోయిన నీలామణి సాబర్​.. అందులో దూకేశారు. ఆ సమయంలో తన కుమారులు, బంధువులు స్నానం చేయడానికి అని పక్కన నీళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారు తిరిగి వచ్చే సరికి ఆయన కూడా కాలి బూడిద అయినట్లు పేర్కొన్నారు. దీనిని అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: GIRL SUICIDE: ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడి మోసం.. తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details