తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్​ ఫంగస్​తో వ్యక్తి మృతి - మహబూబాబాద్​ జిల్లా వార్తలు

బ్లాక్​ఫంగస్​ కేసులు కలవరపెడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్​ ఫంగస్​ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Telangana news
మహబూబాబాద్​ వార్తలు

By

Published : Jun 2, 2021, 8:55 AM IST

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిపై బ్లాక్​ఫంగస్​ ముప్పు ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం బీల్యానాయక్​కు తండా శివారు బొడతండాకు చెందిన ఓ వ్యక్తి కోఠిలోని ఈఎన్​టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గ్రామానికి చెందిన శ్రీను (47) గత నెలలో కొవిడ్​ బారిన పడ్డాడు. మహబూబాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇంటికెళ్లిన మూడు రోజులకు అస్వస్థతకు గురయ్యాడు. మే 28న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా.. వైద్యులు బ్లాక్​ ఫంగస్​గా నిర్ధరించారు. చికిత్స కోసం కోఠిలోని ఈఎన్​టీ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి:ధాన్యం లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details