మామిడి కాయల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీరేశం గౌడ్ అనే వ్యక్తి మామిడి కాయల కోసమని ఇంటి నుంచి బయటకి వెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
మామిడికాయల కోసం వెళ్లి.. మృత్యు ఒడికి! - తెలంగాణ వార్తలు
మామిడికాయలు తీసుకొస్తానని వెళ్లిన ఓ వ్యక్తి మృత్యు ఒడికి చేరాడు. మామిడి కాయలు కోసే క్రమంలో చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు.
చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి, బొంతపల్లిలో వ్యక్తి మృతి
శ్మశాన వాటికలోని మామిడి చెట్టు ఎక్కి జారిపడగా... తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రేమిస్తున్నానంటూ వెంటపడి... పెళ్లికి ఒప్పుకోలేదని గొంతుకోశాడు