family suicide: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ కుటుంబం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నాదర్గుల్ పరిధిలోని కూర్మల్గూడలో జరిగింది. మృతులు కుద్దుస్ పాషా (37), ఫాతిమా (28), మెహర్ (9), ఫిర్దోషు భేగం(6)గా గుర్తించారు. వీరి కుటుంబం హైదరాబాద్‌లోని సంతోశ్‌నగర్‌లో ఉంటున్నట్లు తెలిపారు.
family suicide: 10వేలు ఇవ్వలేదని ఇంట్లో గొడవ.. భార్య, పిల్లలను చెరువులో తోసి.. తాను కూడా.. - కూర్మల్ గూడలో చెరువులో ఆత్మహత్య
06:26 May 31
family suicide: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కుద్దుస్ పాషా, ఆయన కుమార్తెను బయటికి తీయగా వారు అప్పటికే మృతిచెందారు. ఉదయం తల్లి, మరో బిడ్డ మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు.కుద్దుస్ పాషా ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.10వేల విషయంలో గొడవ: రూ.10 వేల విషయంలో భార్య ఫాతిమాతో ఖుద్దూస్ రాత్రి గొడవపడ్డాడు. అనంతరం భార్య, ఇద్దరు పిల్లలను బైక్‌పై కుర్మల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. మొదట పిల్లలు, భార్యను బలవంతంగా చెరువులో తోసేసిన ఖుద్దూస్.. తానూ కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవీ చూడండి:Suicide Attempt: ఇంట్లో విషం తాగి టీవీ నటి ఆత్మహత్యాయత్నం