లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు చెలరేగగా... క్షణికావేశంలో ఉరి వేసుకుని చనిపోయాడు. ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయివాడలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉపాధి కోల్పోయి.. ఆర్థిక ఇబ్బందులతో డ్రైవర్ ఆత్మహత్య - driver committed suicide
లాక్ డౌన్ వల్ల ఉపాధి లేదు. ఇల్లు గడిచే దారి కనిపించలేదు. చివరికి ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. ఆ గొడవలో క్షణికావేశానికి గురై ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ములుగు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పెండెల అంబేద్కర్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం కవిత అనే మహిళతో వివాహం జరిగింది. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు. డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. గత కొన్ని రోజులు కింద కరోనా సోకడంతో... ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎక్కువై కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
ఇదీ చూడండి: Air Force : 'దేశ భద్రతలో వాయుసేనది కీలకపాత్ర'