తెలంగాణ

telangana

ETV Bharat / crime

Attack on traffic police: కారు ఆపమన్నందుకు కానిస్టేబుల్​పై దాడి.. వీడియో వైరల్ - భీమవరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్‌ దాడి

Attack on traffic police: ఏపీలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్​పైనే దాడి చేశాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ దౌర్జన్యం ప్రదర్శించాడు. అధిక వేగంతో వెళ్తున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించగా ఈ ఘటన జరిగింది.

VIRAL VIDEO
ట్రాఫిక్ కానిస్టేబుల్​పైనే దాడి

By

Published : May 3, 2022, 3:36 PM IST

Attack on traffic police: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్‌ దాడికి దిగాడు. అత్యంత వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్‌ యత్నించాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కారు డ్రైవర్‌ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం ప్రదర్శించాడు. ఆవేశంతో అతనిపై పిడిగుద్దులు కురిపించాడు.

కారు ఆపమన్నందుకు కానిస్టేబుల్​పై దాడి.. వీడియో వైరల్

కానిస్టేబుల్​పై దాడి చేసిన కారు డ్రైవర్​ను భీమవరంలోని గునుపూడికి చెందిన సంతోశ్​గా గుర్తించారు. కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details