Banjarahills Car Accident Today : నూతన సంవత్సరం రోజున విషాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న మారుతి కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్ను ఢీ కొట్టి అదుపుతప్పి అపసవ్య దిశలోకి మళ్లింది. అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. ఆపై అక్కడ నిలిపి ఉన్న మరో రెండు కార్లను వెనుక నుంచి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో మరో ఇద్దరు గాయపడ్డారు.
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు - ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి
Banjarahills Car Accident Today : బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. టిఫిన్ చేస్తున్న ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియాకు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి: