boy died in rajendra nagar: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తప్పిపోయాడని భావిస్తున్న బాలుడి మృతదేహం చెరువు వద్ద లభ్యమైంది. రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి చరణ్(9) కనిపించడం లేదంటూ రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.
boy died in pond: "తప్పిపోయాడనుకుంటే... తిరిగిరాని లోకాలకు చేరాడు"
boy died in pond: తప్పిపోయాడనుకున్న బాలుడు విగతజీవిగా కనిపించాడు. చెరువులో శవమై తేలాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీలో జరిగింది.
చెరువులో పడి మృతి చెందిన బాలుడు
dead body in pond: ఇదిలా ఉండగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో సన్సిటీలోని చెరువు వద్ద బాలుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. అయితే స్నేహితులతో పాటు అక్కడికి వెళ్లాడా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.